రజనీకాంత్ కు షాక్ ఇచ్చిన తెలుగోడు

తమిళనాట ఉద్రిక్తతలకు దారితీసిన దక్షిణ భారత్ సినీ నటుల సంఘం (నడిగర్ సంఘం) రెండు చీలి దాడులు, వాగ్వాదాలకు దారితీసింది.. తమిళ సినీ సంఘంకు పదేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ కు తెలుగువ్యక్తి, తమిళంలో హీరోగా రాణిస్తున్న విశాల్ షాక్ ఇచ్చాడు. గుత్తాదిపత్యానికి చెక్ చెబుతూ శరత్ పై పోటీకి దిగాడు.. దీంతో ఎన్నిక అనివార్యమైంది.. తమిళ సంఘం రెండు వర్గాలుగా విడిపోయింది.. తమిళనాడు సీఎం జయలలిత, ప్రముఖ నటుడు రజనీకాంత్ పదేళ్లుగా సంఘం అద్యక్షుడిగా ఉంటున్న శరత్ కుమార్ వైపు నిలబడగా.. మార్పు కోరుకుంటున్నామంటూ మరో ప్రముఖ హీరో కమల్ హాసన్ యువ హీరో విశాల్, నాజర్ బృందానికి మద్దతు తెలిపారు.

Pandavar-Team-for-Nadigar-Sangam-Election

ఎన్నికల ముందు వేళ హీటెక్కిన రాజకీయాలతో విశాల్ పై శరత్ కుమార్ దాడి కూడా చేశాడు.ఇక శరత్ కుమార్ కు మద్దతు తెలిపిన రజినీకాంత్ నడిగర్ సంఘాన్ని తమిళ సంఘంగా పేరుమార్చాలని ఇతర భాషల నటీనటులకు చోటు కల్పించవద్దంటూ విశాల్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాల్ తెలుగు ప్రాంతానికి చెందిన వాడే కావడమే రజనీ విమర్శలకు కారణంగా తెలిసింది. దీంతో కమల్ భాషకు, సంఘానికి సంబంధం లేదంటూ పేరును భారత చలనచిత్రం సంఘం చేయాలంటూ రజనీ విమర్శలను తిప్పికొట్టారు.

తమిళనాట ఇద్దరు ప్రముఖ హీరోలు రజనీ , కమల్ హాసన్ లు ఇలా వేర్వేరు సంఘాలు మద్దతివ్వడంతో ఎన్నికలు హీట్ ఎక్కాయి.. కానీ ఫలితం విశాల్ వశమైంది.. తెలుగు వ్యక్తికే తమిళ నటులు ఓటేశారు.. దీంతో రజనీ అభాసుపాలయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *