Breaking News

రచ్చరచ్చయిన ‘5% కమీషన్’

ponnam jagadessh-02

-మంత్రి జగదీశ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల మధ్య పొలిటికల్ ఫైట్
-పరువునష్టం దావా వేస్తానంటున్న జగదీశ్ రెడ్డి
-ఆధారాలున్నాయంటున్న పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,ప్రతినిధి : ఫీజు రీయింబర్స్ మెంటులో 5% కమీషన్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నిధులు విడుదలలో మంత్రి జగదీష్ రెడ్డి కమీషన్ తీసుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిన్న ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ ఆరోణలకు మంత్రి జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ‘నేను కమీషన్ తీసుకోలేదని.. ఈ విషయంలో క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.. దీంతో రాజకీయాలు వేడెక్కాయి.

ఆరోపణలు రాగానే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను భర్తరఫ్ చేసి విధంగానే సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి ని తొలగించాలని పొన్నం డిమాండ్ చేశారు. కాగా సోమవారం గాంధీభవన్ లో మరోసారి పొన్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి జగదీశ్ రెడ్డి పరుషంగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. మంత్రిపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా సమర్పిస్తానని ప్రభుత్వం విచారణ జరిపిస్తామని పొన్నం డిమాండ్ చేశారు.

కాగా పొన్నం సవాలు.. జగదీశ్ రెడ్డి ప్రతి సవాలుతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. జగదీశ్ రెడ్డి పొన్నం కౌంటర్ కు స్పందిస్తాడో లేదో చూడాలి. కమీషన్ లెక్కల్లోనే జగదీశ్ రెడ్డికి మంత్రిపదవి పోయిందన్న పొన్నం ఆధారాలున్నాయనడంతో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ కొనసాగుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *