
పాకిస్తాన్ మాజీ మంత్రి కసూరి కి స్వాగతం పలికి.. ఆయన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ముంబైకి చెందిన రచయిత సురేంద్రకులకుర్ణిపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇంక్ మొత్తం ఆయనపై కుమ్మరించి దాడులకు పాల్పడ్డారు.
బార్డర్ లో భారత సైనికుల తలలు నరుకుతున్న పాకిస్తాన్ కు తొత్తుగా వ్యవహరిస్తూ సురేంద్ర ఆ దేశ మంత్రి పుస్తకావిష్కరణలో పాల్గొనడంపై శివసేన కార్యకర్తలు మండిపడ్డారు. అందులో భాగంగానే సురేంద్రపై ఇంక్ పోసి దాడి చేశారు.