
కరీంనగర్ : అన్ని దానాల కన్నా రక్తదానం అమూల్యమైనదని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రక్తం ఆపద్భాంధవులుగా నిలిచేందుకు పౌరులు రక్తదానం చేయాలన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ మంగళవారం నాడు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని దివంగత జాన్ విల్సన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ల సహకారంతో రక్తదాన శిభిరాన్ని నిర్వహించింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ డేవిస్ మాట్లాడారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 93 మంది పోలీసులతో పాటు నగరంలోని పోలీస్ స్టేషన్లు, ఆర్మ్ డ్ రిజర్వ్ బలగాలకు చెందిన 93 మంది పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బి.జనార్దన్ రెడ్డి, ఓఎస్డీ సుబ్బారాయుడు, కరీంనగర్ డీఎస్పీ జే రామారావు, ఏఆర్ డీఎస్పీ కోటేశ్వరరావు , రెడ్ క్రాస్ వైద్యులు , లయన్స్ క్లబ్ చైర్మన్ గట్టు రాజయ్య, వన్ టౌన్, త్రీటౌన్ ఇన్ స్పెక్టర్లు విజయసారథి, సదానందం, తదితరులు పాల్గొన్నారు.