
టాలీవుడ్ గ్లామర్ గా దూసుకొచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో దిగిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ అందం, అభినయం తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా రకుల్ సొగసు సోయగం బాగా నచ్చాయట. అందుకే ఈ ముద్దుగుమ్మే అనకు సరైన జోడీ అని ఫిక్స్ అయ్యాడట, తన తదుపరి సినిమాకి.
ఇంకేం, తారక్ కు తగిన జోడీ అని డైరెక్టర్ సుకుమార్ కూడా కన్నిన్స్ అయ్యాడట. దీంతో రకుల్ ను సంప్రదించడం కూడా జరిగిపోయింది. ఇంత మంచి ఆఫర్ ను రకుల్ ఎలా కాదంటుంది. అందుకే ఓకే చెప్పేసిందట. అంటే తదుపరి సినిమాలో యంగ్ టైగర్ సత్తాను సవాల్ చేస్తూ, స్టెప్పుల్లో పోటీ పడుతూ, తెరమీద రొమాన్స్ చేస్తూ ఈ ఢిల్లీ భామ కనువిందు చేయబోతోందన్న మాట.
ఈ మధ్య మాంచి జోరుమీదున్న రకుల్ ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు టాప్ రేంజిలో ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతోంది. 2015 టాలీవుడ్లో రకుల్ నామ సంవత్సరం అవుతుందేమో.