Breaking News

రండి.. హరీష్ దయ చేయండి..

harish-raomichigon

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఖండాతర ఖ్యాతి లభిస్తోంది. ఏ మూహూర్తానా కేసీఆర్ చెరువుల పునరుద్ధరణ చేయాలని మిషన్ కాకతీయకు నిర్ణయించారో గానీ అదీ చాలా సక్సెస్ అయింది. ఈ సబ్జెక్ట్ ఒక విదేశీ యూనివర్సిటీ గుర్తించి వారి విద్యార్థులను దీనిపై పరిశోధనకు పంపింది. దీనికి గాను 50 వేల అమెరికన్ డాలర్లును కేటాయించింది.

కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు, వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు పూనుకోవడంతో దీనిపై పరిశోధనకు ప్రతిష్టాత్మక అమెరికన్ మిచ్ గాన్ యూనివర్సిటీ పరిశోదనకు తన విద్యార్థులను ఆదేశించింది. ఆ విద్యార్థులు వచ్చి రాష్ట్రంలో పర్యటించి ఆ యూనివర్సిటీకి నివేదిక పత్రం సమర్పించారు.

కాగా ఇప్పడు అదే మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలంటూ మంత్రి హరీష్ రావుకు అమెరికానుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే ఆయన అమెరికాలో పర్యటించి.. మిషన్ కాకతీయను వివరిస్తానని విలేకరులకు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *