
సీఎం కేసీఆర్ చైనా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. చైనాలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటి అయ్యారు. పలువురు సీఈవోలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసిస్తూ తాము పెట్టుబడులు పెడతామని తెలిపారు.
ఈ సందర్భం గా చైనాలో దిగ్గజ పారిశ్రామిక వేత్త లియో గ్రూప్ చైర్మన్ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో తారు 1000 కోట్లతో హెవీ డ్యూటీ పంపుల పరిశ్రమ స్థాపిస్తామని లియోవాంగ్ ప్రకటించారు.
ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రపంచంలో మేటిదని.. చైనాలోని కంపెనీలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నామని తెలిపారు.