
కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు గురువారం కరీంనగర్లోని ఇందిరభవన్ లో యోగా చార్య సంపత్ కుమార్ రచించిన ‘యోగా హస్తముద్రలు’గ్రంథాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ విప్ ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ నాయకులతో పాటు డా. దీపక్ బాబు, జితేందర్ రావు,ప్రదీప్ కుమార్, కార్పొరేటర్ ఆకుల ప్రకాష్, చొడగొండ బుచ్చిరెడ్డి, మూల జైపాల్, ఆకుల మోహన్, తదితరలు పాల్గొన్నారు.