
హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ యూసుఫ్గడ్ జవహర్‌నగర్‌లోని ఓ ఇంటిలో జరిగిన పేలుడు చిన్నారి కీర్తివాణిని బలితీసుకుంది. కాగా మరో ఇద్దరు చిన్నారులు నర్సింహ్మ, యాదమ్మల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరిద్దరికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం 9.15గం.ల సమయంలో జవహర్‌నగర్‌లోని ఓ ఇంటిలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఆవరణలో ఆడుకుంటున్న కీర్తివాణి, యాదమ్మ, నర్సింహ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి శరీరాలు సగం వరకు కాలిపోయాయి. చిన్నారుల ఆర్తనాదాలు, ఆక్రందనలతో ఘటనాస్థలం మార్మోగిపోయింది. అయితే పేలుడుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిలెటెన్ స్టిక్స్ పేలినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు జరిగిన ప్రాంతంలో బాంబుస్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.