Breaking News

యూనిసెఫ్ సహకారంతో ఉమ్మడి జిల్లాలో పారిశుధ్య సుస్ధిరత: కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

యూనిసెఫ్ సహకారంతో ఉమ్మడి జిల్లాలో పారిశుధ్య సుస్ధిరత: కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

యూనిసెఫ్ సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పారిశుధ్య సుస్ధిరత సాధ్యపడే దిశగా సాగుతుందని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని డ్వామా సమావేశ మందిరంలో నిర్వహించిన ‘యూనిసెఫ్ ప్రాజెక్ట్ సహకారంతో ఆదర్శ సుస్ధిర బహిరంగ మల విసర్జన రహిత జిల్లాల సాధన స్ధాయి పమీక్ష’సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాలుగా మార్చు క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఓడీఎఫ్ (మలవిసర్జన రహిత) ప్రకటించిన నాటికి 8.5 శాతం ఉన్న బహిరంగ మల విసర్జనను 2.2 శాతానికి తగ్గించి ప్రస్తుతం 97.78 శాతంలో రాష్ట్ర్రంలోనే ముందు వరుసలో ఉండేలా యూనిసెఫ్ సహకరించిందని అన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఇతర సంస్ధలలో వాష్ (చేతుల శుభ్రత) కార్యక్రమాలకు సహకారం అందిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయానికి వారధిగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో 15144 మంది విద్యార్ధులకు చేతుల శుభ్రత పై అవగాహన, 14809 మంది కిశోర బాలికలకు రుతుస్రావ విషయాలపై అవగాహన, జాగ్రత్తలు వివరించడం జరిగిందన్నారు. దేశంలో మొట్ట మొదటి సారిగా ఈ ప్రాజెక్ట్ పరిధిలో వాలంటరీ వ్యవస్ధను ఏర్పాటు చేసి 2286 మంది స్వచ్చంద సేవకులను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకుని, వీరిని సుస్ధిర పారిశుధ్య కార్యక్రమాల వైపు మళ్లించే ప్రయత్నం చేశామని తెలిపారు. అనంతరం యూనిసెఫ్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కిషన్ స్వామి ఆధ్వర్యంలోని బృందం ’భేటి బచావో -బేటి పడావో లో జాతీయ స్ధాయి పురస్కారం అందుకోనున్న సందర్భంగా కలెక్టర్ కు పుఫ్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ కో ఆర్గినేటర్ కిషన్ స్వామి, డిఆర్ డిఏ ఏపిడి వెంకటేశ్వర్లు, ఎస్ బిఎం రమేష్, వేణు ప్రసాద్, క్లస్టర్ ఫెసిలిటేటర్లు, ఉమ్మడి జిల్లా యూనిసెఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *