యూనివర్శిటీల పటిష్టతపై తెలంగాణ సర్కారు ప్రణాళిక

· నల్గొండ, మహాత్మాగాంధీ యూనివర్శిటీలో 30.3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

· విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, నియామకాలపై ప్రత్యేక దృష్టి

నల్గొండ 12 – తెలంగాణ రాష్ట్రంలో యూనివర్శిటీలను పటిష్టం చేసే కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. యూనివర్శిటీలలో మౌలిక వసతుల కల్పన, ఖాళీలు భర్తీ చేయాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు. ఇటీవల జరిగిన యూనివర్శిటీల వీసీల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ యూనివర్శిటీల బలోపేతం గురించి స్పష్టంగా చెప్పారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి సూచించినట్లు విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు వీసీలతో సమావేశం ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాల్లోని సమస్యల గురించి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశలో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నేడు నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో 30.3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎస్సీ అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో 13.90 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన ఇంజనీరింగ్ కాలేజీ బిల్డింగ్, 6.34 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎగ్జామినేషన్ బ్రాంచి బిల్డింగ్ లకు శంకుస్థాపనలు వేశారు. 6.5 కోట్ల రూపాయలతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్, 3.56 కోట్ల రూపాయలతో వేసిన యూనివర్శిటీలోని సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాల్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి,పూల రవీందర్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *