
ఫేస్ బుక్ మరో విప్లవాత్మక మార్పును తీసుకొస్తోంది.. ఇన్నాళ్లు ప్రజలు యూట్యూబ్ లో ఎలాగైతే వీడియోలు సెర్చ్ చేసుకొని తమ వారిని, వేరొకరివి చూసేవారో సేమ్ అలానే దానికంటే బెటర్ అయిన వీడియో సెర్చ్ తో ఫేస్ బుక్ వీడియో బుక్ ను తీసుకొస్తోంది.. ప్రస్తుతం ఫేస్ బుక్ దీనిపై పరీక్షలు చేస్తోందట.. త్వరలోనే దీన్ని ప్రజల సౌకర్యార్థం తీసుకొస్తుందని ఫేస్ బుక్ తెలిపింది.
ఇందుకోసం ఫేస్ బుక్ లో న్యూస్ ఫీడ్ కు ఎడమవైపున ఫేవరేట్స్ సెక్షన్ లో ఐకాన్ ను పొందుపరుస్తున్నారు. ఈ ఐకాన్ లో వీడియోలు చూడవచ్చు. న్యూస్ ఫీడ్ కు ఎడమవైపు ఫేవరేట్ అనే సెక్షన్ లో ఈ ఐకన్ ఉంటుందుంట.. యూట్యూబ్ మాదిరిగానే వీడియోలను చూస్తూ న్యూస్ ఫీడ్ ను చూసుకునేలా రూపొందిస్తున్నారట..