‘యువరాజు’ వచ్చినాడే..

ఢిల్లీ : రెండునెలల విరామమనంతరం ఎట్టకేలకు యువరాజు దర్శనభాగ్యం దేశ ప్రజలకు కలిగింది.  తన రెండు నెలల టూర్ ను ముగించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఢీల్లీ చేరుకున్నారు. ఆయన రాకను తెలుసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అక్క ప్రియాంక గాంధీ లు హుటాహుటిన రాహుల్ నివాసానికి చేరుకొని రాహుల్ కు స్వాగతం పలికారు.

కాగా రాహుల్ ఈ 56 రోజుల పర్యటనలో వియత్నాం, మలేషియా, భూటాన్, యూరప్ తదితర దేశాల్లో పర్యటించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన లోని లోపాలను గుర్తించి సరిదిద్దుకునేందుకు ఆయన విదేశాలకు వెళ్లారని.. తర్వలోనే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న దృశ్యా మెంటల్ గా ప్రిపేర్ కావడానికే ఆయన విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

కాగా ఈనెల 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో నిర్వహించే రైతు వ్యతిరేక ర్యాలీ లో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *