యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరధ పనులు చేపట్టాలి

కరీంనగర్: జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరధ (వాటర్ గ్రిడ్) పనులు పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరధ పనులు సమన్వయ కమిటీ
సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వచ్చే జూన్ నాటికి 69 గ్రామాలకు, డిసెంబర్ నాటికి 41 గ్రామాలకు మిషన్ భగీరధ ద్వారా త్రాగునీరు అందించుటకు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరధ పనులు రాత్రింబవళ్లు చేయాలని ఆదేశించారు. ప్రతి వాటర్ గ్రిడ్ పనికి ఒక డి.ఇ. లేదా ఎ.ఇ.కి బాధ్యత అప్పగించాలని ఆదేశించారు. ప్రతి రోజు పనుల ప్రగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. మిషన్ భగీరధ ప్రగతిని ప్రతి వారం సమన్వయ కమిటి సమావేశంలో సమీక్షిస్తామని తెలిపారు. గ్రామాల వారిగా వాటర్ గ్రిడ్ కమిటిలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ కమిటీలు వాటర్ గ్రిడ్ పనులలో సమస్యలుంటే పరిష్కరించి వేగవంతంగా పనులు పూర్తి చేయుటకు సహకరించాలని సూచించారు. అలాగే మండల స్ధాయి వాటర్ గ్రిడ్ కమిటిలను యం.పి.డి.ఓ. తహశీల్దార్, ఆర్.డబ్ల్యు.ఎస్ ఎఇ ఇతర సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసి పనుల ప్రగతిని సమీక్షించాలని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మిషన్ భగీరధ కింద గ్రామాలలో నిర్మించు ఓ.ఆర్.ఎస్. ట్యాంకుల నిర్మాణాల పనులని వచ్చే లోగా గ్రౌండింగ్ లెవల్ వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పైపులైన్ల కొనుగోలుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు నిర్ణయించిన గడువు లోగా పూర్తి చేయుటకు కాంట్రాక్టర్ల పై వత్తిడి తేవాలని ఆదేశించారు. రైల్వే ట్రాకులు, రోడ్లు, రహదారులు కింద నుండి వాటర్ గ్రిడ్ పైపులైన్లు వేయుటకు సంబంధిత శాఖల చే నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు పొందాలని సూచించారు. అందుకు అధికారులు సంయుక్త క్షేత్ర స్ధాయి పర్యటనలు చేయాలని సూచించారు. వాటర్ గ్రిడ్ పనుల నిర్మాణాలకు అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని వెంటనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. మిషన్ భగీరధ పనులకు భూ సేకరణ త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో
నీటిపారుదల శాఖ సిఇ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరధ ఎస్.ఇ. శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్.ఇ. ప్రకాశ్ రావు, ఆర్.డి.ఓ. చంద్ర శేఖర్, ఇఇలు రాజేంద్రకుమార్, ఉప్పలయ్య, రాజీవ్ రహదారి డి.ఇ. సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *