యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టుల పూర్తి : మంత్రి హరీశ్ రావు

-యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టుల పూర్తి.

-ఇకపై పదిరోజులకోసారి జిల్లాలో మకాం.

-ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా నిరంతర మానిటరింగ్.

-ఈ ఖరీఫ్ లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు.

-గ్రీన్ ఛానల్ లో నిధులు.

-తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపిన కుహనా మేధావులు.

-పని చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెడతాం.

-మంత్రి హరీశ్ రావు.

పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్న వారిని, ప్రాజెక్టుల నిలుపుదల కోరుతూ కేసులు వేస్తున్న తెలంగాణ ద్రోహులను కుహనా మేధావులు నిలదీయడంలేదని మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన జిల్లా మంత్రులు జూపల్లి, డాక్టర్ లక్ష్మారెడ్డి తదితర ఎం ఎల్ ఏ లతో కలిసి కల్వకుర్తి కాలువలను గురువారం సందర్శించారు. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. కుహనా మేధావులు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న ద్రోహులతో కుహనా మేధావులు కుమ్మక్కు అయ్యారా?అని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తో పాలమూరు జిల్లాకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇది దుష్ప్రచారం అని అన్నారు. నల్లగొండ, పాలమూరు జిల్లా ల మధ్య వైషమ్యాలు రావని చెప్పారు. ఇకపై పది రోజుల కోసారి జిల్లాలో పర్యటిస్తానని… ఇక్కడే మకాం పెట్టి ఆన్ గోయింగ్ పథకాలు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేవరకు నిరంతరం మానిటర్ చేస్తానన్నారు.

పూర్వ మహబూబ్ నగర్ జిల్లా లోని  ప్రాజెక్టులను  యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుమరోసారి ప్రకటించారు. భూసేకరణ కు సహకరిస్తున్న రైతులు, ప్రజలకు పాదాభివందనం చేస్తున్ననని హరీష్ అన్నారు. జిల్లా నుంచి కరువును శాశ్వతంగా పారదో లుతామని చెప్పారు.  నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఏజెన్సీ లతో పాటు సంబంధిత ఇంజనీర్లపై  కూడా చర్యలు తప్పవని హరీశ్ రావు హెచ్చరించారు. పని చేయని ఏజెన్సీలను డిబార్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడతామని అన్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టు లను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ను  కొత్త చట్టం ప్రకారం వెంటనే పూర్తి  చేయాలని కోరారు.  భూసేకరణపై  స్పెషల్ డ్రైవ్ చేయాలని మంత్రి ఆదేశించారు.

4 ప్రాజెక్టుల పనుల పురోగతిని, భూసేకరణ ప్రక్రియను గుడిపల్లి గట్టు దగ్గర కల్వకుర్తి లిఫ్ట్ 3 గెస్ట్ హౌజ్లో ప్యాకేజీ ల వారీగా సమీక్షించారు.కల్వకుర్తి నుంచి 3 లక్షలు, బీమా నుంచి 2 లక్షలు, నెట్టంపాడు నుంచి 1.50 లక్షలు, కోయిల్ సాగర్ నుంచి 50 వేల ఎకరాలకు  ఈ ఖరీఫ్ లో  సాగునీరందిస్తా మని హరీశ్ రావు అన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1 లక్ష ఎకరాలకు కలుపుకొని మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరందించాలని కోరారు.కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం ప్రాధాన్యతా  ప్రకారం ప్రభుత్వం పెట్టిన టార్గెట్  ప్రకారం పనులు  పూర్తి  చేయాలన్నారు.ఖరీఫ్ లోపున పాలమూరు ప్రాజెక్టుల పూర్తి చేస్తామని, గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల  చేస్తామని  ప్రకటించారు.   జిల్లాలోని ఆన్ గోయింగ్ సాగునీటి పధకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇంజనీర్లు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.  ఫ్లడ్ లైట్లు పెట్టి పనులు చేయిస్తున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. ఏళ్ల తరబడి పూర్తి కాని ఈ ప్రాజెక్టులను ఖరీఫ్లో పూర్తి చేయవలసిందేనని హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్ లను నిరంతరం తనిఖీలు చేయాలని,  పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వాట్స్ అప్ లో పెట్టాలని అధికారులను కోరారు. పంప్ హౌస్ ల నిర్వహణకు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలని హరీశ్ ఆదేశించారు. ఈ నాలుగు ఆన్ గోయింగ్ పథకాల కోసం ఇంకా  భూసేకరణ జరగవలసి ఉందన్నారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ పనులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి తెలిపారు. ఈ నాలుగు ఆన్గోయింగ్ పథకాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు కోసమే 1000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.  మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజనరెడ్డి,  ఎం.ఎల్.ఏ ఆల వెంకటేశ్వరరెడ్డి,బాలరాజు, ఈ. ఎం.సి.మురళిధర రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, సిఇ ఖగేందర్ రావు, ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు వెంట సి.ఎం.ఓ.ఎస్.డి. దేశ్ పతి శ్రీనివాస్, మల్లెపల్లి లక్ష్మయ్య పాలమూరు లో పర్యటించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *