యాసంగి లో 17 లక్షల ఎకరాలకు సాగు నీరు

యాసంగి లో 17 లక్షల ఎకరాలకు సాగు నీరు.

చిట్ట చివరి ఆయకట్టు రైతులకు నీరివ్వాలి.

సాగునీటి సరఫరాను సమర్ధంగా నిర్వహించాలి.

నిజాం సాగర్ ను మోడల్ గా తీసుకోవాలి.

యాసంగి యాక్షన్ ప్లాన్ పై మంత్రి వీడియో కాన్ఫరెన్సు.

మంత్రి హరీశ్ రావు.

ఈ యాసంగిలో మీడియం, మేజర్ ప్రాజెక్టుల కింద 17 లక్షల  ఎకరాలకు సాగునీరివ్వనున్నట్టు  ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.శుక్రవారం నాడు సేక్రేటేరియట్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.1 7 లక్షలకు సాగునీరందించే లక్ష్యసాధనలో ప్రతి ఎకరాకు నీల్లివ్వాలని, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.ప్రాజెక్టులు, కాల్వలు, జిల్లాల వారీగా యాసంగి సీజన్ లో సాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి తెలియజేశారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఎక్కడైనా రైతులు కాలవలకు గండ్లు పెట్టినా, తూములను ధ్వంసం చేసినా, కటిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇందుకు గాను పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని హరీశ్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గత యేడాది నిజామాబాద్ జిల్లాలో  నిజాంసాగర్ కింద సమర్ధ సాగునీటి నిర్వహణ వల్ల ఒక టీ.ఎం.సి.కి 15 నుంచి 16 వేల ఎకరాలు సాగయ్యాయని అన్నారు. దాదాపు ముప్ఫై ఏళ్లుగా నీరు పారని పొలాలకు సైతం నిజాంసాగర్ నుంచి నీళ్ళు అందాయని మంత్రి తెలిపారు.

దానిని బెంచ్ మార్కు గా తీసుకోవాలని మంత్రి కోరారు.ఆన్ అండ్ ఆఫ్ పధ్ధతిలో సాగునీటిని సరఫరా చేయాలని మంత్రి కోరారు.తాగునీటికి  మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వాలని,తాగునీటి కోసం నీటిని రిజర్వ్ చేసిన తర్వాత సాగునీటి సరఫరా చేయాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను ప్రణాలికాబద్దంగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.ఏ ప్రాంతంలో, ఏ పంటకు ఎంత ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక రూపొందించారో దానిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.చైతన్యం తీసుకు రావాలని కోరారు. రైతులను ముందే చైతన్యం పరచడం వల్ల ఏ యే పంటలు వేసుకోవాలో వారు నిర్ణయాంచుకుంటారని చెప్పారు. చివరి వెట్టింగులోనూ  నీటిని పంటలకు అందేలా చూడాలని,లేకపోతే పంట ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతారని తెలిపారు.ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో,ఉమ్మడిగా పనిచేయాలని,గ్రామాలు, మండలాలు, పంటల వారీగా లెక్కలు పక్కాగ ఉండేటట్లు తయారు చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. యాసంగిలో సాగునీటి సరఫరా, పంటల సాగుపై జిల్లా కలెక్టర్లంతా పదిహేను రోజులకోసారి  పర్యవేక్షించాలని కోరారు.సీజన్ ముగిసిన వెంటనే వాటర్ ఆడిటింగ్ జరగాలని ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

గత సంవత్సరం ఎస్.ఆర్.ఎస్.పి. పరిధిలోని  పెద్దపల్లి జిల్లాలో డి-86 కింద టేల్ టు హెడ్ ప్రయోగం సక్సెస్ అయిన విషయాన్ని ఇరిగేషన్ మంత్రి గుర్తు చేశారు . అదే పద్దతిని అన్ని ప్రాజెక్టులలో,అన్ని కెనాల్స్ లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కేనాల్స్ పై ఇరిగేషన్ ఇంజనీర్లు రెగ్యులర్ గా  వాక్ త్రూ చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కాల్వల వెంట కాలి నడకన వెళ్లి పరిస్థితులను చూడాలని కోరారు. అప్పుడే ఆయకట్టు చివరి భూముల రైతాంగానికి సాగు నీరు అందుతుందో లేదో తెలుస్తుందన్నారు. ఎం.ఆర్.ఓ , వి.ఆర్.వో ,వి.ఆర్.ఏ తదితర రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి కోరారు.ఎస్.ఆర్.ఎస్.పి కేనాల్స్ లో పూడిక తొలగించడంలో,జంగిల్ క్లియరెన్సు లో శ్రమదానం చేసినందుకు జగిత్యాల జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు అభినందించారు. వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్,ఇ.ఎన్.సి. మురళీధర్ రావు, ‘కాడా’ కమిషనర్ మల్సూర్ ,ప్లానింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, సి.ఇ.లు లింగరాజు, సునీల్, మధుసూదన్ రావు, మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్ శ్యాం సుందర్ తదితరులు పాల్గోన్నారు.

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *