
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన యాపిల్ మ్యాప్ప్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్, కేటీఆర్ లను కలిశారు. అనంతరం వేవ్ రాక్ లోని యాపిల్ కార్యాలయానికి చేరుకొని యాపిల్ మ్యాప్ప్ కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు కేసీఆర్, కేటీఆర్ లు టిమ్ కుక్ తో భేటి అయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ హైదరాబాద్ లో మ్యాప్ప్ కేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. దీని ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం మాట్లాడిన యాపిల్ సీఈవో కుక్ ఐ లవ్ ఇండియా అని అన్నారు. భారత పర్యటన ఆనందాన్నించ్చిందని పేర్కొన్నారు. కేటీఆర్, కేసీఆర్, టిమ్ కుక్ లు సెల్పీలు దిగారు.. ఈసందర్భంగా యాపిల్ సీఈవో పర్యటనతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అయ్యిందని కేసీఆర్ కుక్ తో అన్నారు.