యాపిల్ భద్రత వేస్టేనా..?

యాపిల్ ఫోన్లు.. ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 బ్రాండ్.. ఆ ఫోన్ టెక్నాలజీయే ప్రపంచంలో అత్యుత్తమమైనది.. సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ ను చేధించడం అంత సులువు కాదు. స్వయంగా యాపిల్ సంస్థకే తమ ఫోన్లను ఓపెన్ చేయడం సాధ్యం కాదంటే ఎంత పకడ్బందీగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తారో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి యాపిల్ సంస్థ టెక్నాలజీని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్.బీ.ఐ చేధించింది. యాపిల్ సాయం లేకుండా అదునాతన టెక్నాలజీ సాయంతో యాపిల్ ఫోన్ ఓపెన్ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు యాపిల్ టెక్నాలజీ దిగదుడిపే అన్నది ప్రపంచానికి చాటింది.

అసలు విషయానికి వస్తే అమెరికాలో ఇద్దరు పాకిస్తాన్ జంట ఆ మధ్య 30 మందిపై దాడి చేసి చంపించింది. వారు వాడుతున్న యాపిల్ ఫోన్లను ఓపెన్ చేయలేక యాపిల్ సంస్థను ఆశ్రయిస్తే.. వారు టెక్నాలజీ పంచుకోవడానికి ఓపెన్ చేయడానికి నిరాకరించారు. అలా చేస్తే తమ ఫోన్ల విశ్వసనీయత, బ్రాండ్ దెబ్బతింటుందని నిరాకరించారు.

దీంతో ఎఫ్.బీ.ఐ సొంతంగా ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించి యాపిల్ ఫోన్ల మర్మాన్ని గుట్టు విప్పింది. ఓపెన్ చేసి యాపిల్ టెక్నాలజీ నేతిబీర అన్నదాన్ని రుజువు చేసింది. ఉగ్రవాదులు వాడిన ఫోన్లను ఓపెన్ చేసి అందులోని రహస్యాల్ని కనుగొంది.. టెక్నాలజీ ఒక్కరికే సొంతం కాదని రుజువు చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *