Breaking News

యాదాద్రిలో రాష్ట్రపతి , కేసీఆర్ , గవర్నర్ పూజలు

yadadri

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో పర్యటించారు. హరితహారం పర్యటనలో కరీంనగర్ జిల్లాలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి యాద్రిద్రికి వస్తుండంతో కరీంనగర్ నుంచి హెలీక్యాప్టర్ లో వచ్చారు. కాగా రాష్ట్రపతి మధ్యాహ్నం యాదాద్రికి చేరుకోగానే ఆయనకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఆలయ అధికారులు , పూజారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలోపల ప్రణబ్, కేసీఆర్, గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ కు సీఎం కేసీఆర్ యాదగిరి నరసిింహస్వామి విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం గవర్నర్, తెలంగాణ మంత్రులు ఆయనకు వివిధ జ్ఞాపికల్ని బహూకరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *