యాదగిరి గుట్ట చుట్టూ 4 మినీ ట్యాంక్‌బండ్‌లు

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించింది.నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని 4 చెరువులను మినీట్యాంక్‌బండ్‌లుగా మార్చేందుకు నిధులు విడుదల చేశారు. రూ. 16 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లాపూర్‌, సైదాపూర్‌, గండిచెరువు, రాయగిరి చెరువుల మరమ్మతులు, సుందరీకరణకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాలన్, ఆర్‌అండ్‌బి ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ అథారిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు, నల్లగొండ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *