Breaking News

యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతున్న చంద్రబాబు

Mudragada-Padmanabham

ఏపీసీఎం చంద్రబాబు ఉద్యమ విధ్వంసంపై చర్యలకు సిద్ధమవుతున్నారు.. మాజీ మంత్రి ముద్రగడపై కేసులు బనాయించేందుకు ఏపీ పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్, తుని పోలీస్ స్టేషన్ దహనం కేసులో వివిధ చానాళ్లలో ప్రసారమైన వీడియోల ఆధారంగా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. దీంతో పాటు నేతల ఫోన్ కాల్స్ పైనా పోలీసులు ఆరాతీస్తున్నట్టు సమాచారం. కాపుగర్జనలో నేతలు చేసిన ప్రసంగాలను చూస్తున్నారు. రెచ్చగొట్టిన వారిపై కూడా కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది..కాగా దీనిపై ముద్రగడ పద్మనాభం కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ ఒక్కరిని అరెస్ట్ చేసినా ఆమరణ దీక్ష, ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తామని హెచ్చరించారు.  ఏ క్షణానైనా ముద్రగడ అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతుండడంతో తూర్పుగోదావరి జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. అంతేకాదు దీనికి కౌంటర్ గా ముద్రగడ కూడా కాపు నాయకులు, యువజన సంఘాలతో చర్చలు చేస్తున్నారు. అరెస్ట్ అయితే చేయాల్సిన కార్యచరణపై యుద్ధానికి సిద్ధమవుతున్నారట.. మొత్తానికి ప్రభుత్వం ప్రస్తుతం ముద్రగడ టార్గెట్ గా ఉచ్చు బిగుస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *