
దేశవ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కంపెనీ ఉత్పత్తి చేసిన మ్యాగీలో అత్యధిక మోతాదులో విషపూరిత రసాయనాలు, సీసం ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారించి నిషేధించింది. అనంతరం ఢిల్లీ కూడా పరీక్షలు జరిగి విషపూరితాలు గుర్తించింది.దీంతో ఢిల్లీ కూడా 15 రోజుల నిషేధం విధించింది.
దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, ప్రజల నుంచి నిరసన రావడంతో అన్ని రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ పై పరీక్షలు జరుపుతున్నాయి. సీసం, రసయానాలు ఉన్నట్టు తేలితే నిషేధిస్తామని తెలిపాయి. కాగా మ్యాగీ నూడల్స్ పై దేశవ్యాప్తంగా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆహార మంత్రి పాశ్వన్ తెలిపారు.