Breaking News

మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్-లయన్స్ క్లబ్ ఉచిత వైద్యశిభిరం

01

కరీంనగర్ : మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్-లయన్స్ క్లబ్ మానేరు సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం ఉదయం ఫ్రీ బీపీ, షుగర్ చెకప్ క్యాంపు నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. దాదాపు 400 మంది హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఈ ఫ్రీ హెల్త్ క్యాంపు పట్ల పలువురు వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు.

02

మ్యాక్స్ క్యూర్ హాస్పిటర్ జనరల్ మేనేజర్ శ్రీమతి గిరిజ, డాక్టర్ ఏ. సాయి రవిశంకర్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ శేఖర్, డాక్టర్ దేశియా, డాక్టర్ శ్రావణి,డాక్టర్ అరుణ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోదండరాములు, అధ్యక్షులు కమల్ సోనీ, సెక్రటరీ ఎం.ఆదిత్య, కోశాధికారి రాజేందర్ భంగ్, సభ్యులు బొడ్ల రవీందర్, కృష్ణ కిషన్, వాసుదేవరెడ్డి, జీ రాజయ్య, అజయ్, కే.సత్యనారాయణ, ఆర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

03

హెల్త్ చెకప్ చేయించుకున్న వారిలో టీఆర్ఎస్ నాయకులు కలర్ సత్తన్న, కాంగ్రెస్ నాయకులు బొమ్మకల్ లక్ష్మన్, తో పాటు పలువురు ప్రముఖులు, అంబేద్కర్ స్టేడియం కు వచ్చిన వాకర్స్ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ ప్రతినిధి ఏ సాయిరవిశంకర్ మాట్లాడుతూ బీపీ షుగర్ హెల్త్ క్యాంపు విశేష స్పందన లభించిందని.. తమ ఆస్పత్రి పక్షాన ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని.. త్వరలో రామడుగు మండలం వన్నాల గ్రామంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *