
పెద్ద సార్లు సైలెంటయ్యారుల్లా.. ఇదీ వ్యూహంలో భాగమేనంట.. చంద్రబాబుపై ఓట్లకు నోటు కేసు కథ కంచికే పోయినట్టు కనపడుతోంది. ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ ల వైఖరి చూస్తుంటే గట్లనే కనపడుతోంది.
టీ న్యూస్ కు నోటీసులివ్వడంపై చంద్రబాబు అక్కడి పోలీసులపై మండిపడ్డారట.. ప్రశాంతంగా వాతావరణం ఎందుకు చెడగొట్టారంటూ మండిపడ్డారట.. కేసీఆర్ ఏసీబీని తగ్గమని చెప్పాడట.. అందుకే రెండు రోజుల నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు..
ఒకరు ఓటుకు నోటు, మరొకరు ట్యాపింగ్ కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నా కదా.. ఇద్దరం ఇద్దరం కొంప కూల్చుకోవద్దనుకున్నట్టున్నారు.. అందుకే ప్రస్తుతానికి మౌనమేలనోయి.. అంటూ పాటలు పాడుకుంటున్నారు.