Breaking News

మౌనమునీ.. స్పందించవయ్యా..

04-1433365515-modi2

-అవినీతి సంహించనన్నాడు.. కూరుకుపోయాడు..

అవినీతిని సంహించనన్నాడు.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనం బయటకు తెస్తానన్నాడు.. అక్రమార్కుల భరతం పడతానన్నాడు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయాడు.. విదేశాలకు చక్కర్లు కొడుతున్నాడు.. ప్రతిపక్షాలు పార్లమెంటులో లొల్లి చేస్తున్నా.. మీరూ అవినీతి పరులే కదా అని తోటివారితో విమర్శింపచేస్తున్నారు.. కానీ నీతిమంతులైన మీరు చేసేందేంటంటే మాజీ ప్రధానిలా మౌని మునీ అవతారంలో మునిగితేలడం..

ఈ వ్యాఖ్యానం అంతా ప్రధాని నరేంద్ర మోడీ గురించే.. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో నల్లధనం విదేశాల నుంచి తరలించలేదు.. నల్లధన కుబేరులను జైలుకు పంపలేదు.. అంతా అధికారం కోసం ఆడిన మాటల మంత్రాలు అవీ.. మోడీ ఇంతలా మారిపోతాడని జనం ఊహించలేదు.. అందుకే వెల్లువలా ఓట్లేసి గెలిపించారు. కానీ ప్రజల ఆశలు వమ్ము చేశాడు..

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ప్రధాని సహకరించారు. కేసును నీరుగార్చేలా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ఇప్పుడా కేసు మిన్నకుండిపోయింది.. ఇక క్రికెట్ బెట్జింగ్ సూత్రాధిరి లలిత్ మోడీకి సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను నెత్తిన పెట్టుకోవడం.. సపోర్ట్ చేసిన రాజస్తాన్ సీఎం వసుంధర రాజేను బలపరచడం.. ప్రధానికి మచ్చ తెచ్చింది.. ఇక మధ్యప్రదేశ్ కోరలు చాచిన వ్యాపం కుంభకోణం 50 మంది మృతులకు కారణమైనా.. ప్రధాని నోరువిప్పడం లేదు.. ఆ రాష్ట్ర సీఎంకు శతవిధాల సహకరిస్తున్నారు..

ఇన్నీ కుంభకోణాలతో సంవత్సరం బీజేపీ ప్రభుత్వం మకిలి పట్టింది.. దీన్ని నీతి లాంటి నీటితో కడిగినా అది సమసిపోదు.. అందుకే ఈ బురద అంటుకున్న ప్రధాని ఇంకా అవినీతిపై ఉపన్యాసం ఇస్తే జనం నవ్వుకునే రోజులు వస్తాయి.. మౌనమునీ స్పందిచవయ్యా మోడీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *