మౌనం – నవ్వు

మౌనం నవ్వు రెండు గొప్పవే
నవ్వుతో కష్టాలు మరిచిపోవచ్చనేది
మౌనం తో కష్టాలు దరికి చేరనివ్వరాదనేది
సత్యమే.
మౌనంతో ఈ ప్రపంచాన్ని
చాల క్షున్నంగా చూడవచ్చు
నవ్వుతో ఏ విషయాన్నయిన
క్లుప్తంగా చెప్పవచ్చు
మౌనం లో నవ్వు ఏడుపు ఉద్వేగం
అన్నీ ఉంటాయి
నవ్వుతో సంతోషం ఉత్తేజం
కలుగుతాయి
నాకు తెలిసి మౌనం నాకొక ఆస్తి
అందులో నేను నవ్వుకుంటాను…ఏడుస్తాను
నవ్వు నాకొక ఆభరణం
దానితో ఈ సమాజానికి నేను
ఆకర్షనీయంగా కనిపిస్తాను
అందుకే,మౌనంగా నవ్వేస్తుంటాను
నవ్వుతూ… నిశబ్దంగా ఉంటాను.
నిశ్శబ్దంలోంచి వచ్చె
మౌనమైన నవ్వే హృదయానికి
నిజమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది
_ కొత్త అనిల్ కుమార్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.