Breaking News

మోసూల్ చారిత్రక కట్టడాలు ధ్వంసం

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చారిత్రక ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ప్రాచీన పర్షియన్ నాగరికతకు ఆలవాలమైన ఇరాక్ లోని పురాతన మందిరాలను విగ్రహాలను ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ధ్వంసం చేస్తున్నారు. బంగారు, వెండి, ఇతర ఖరీదైన లోహలతో తయారైన విగ్రహాలను విదేశాలకు అమ్ముకుంటూ తమ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు.

గురువారం ఇరాక్ లోని మోసూల్ పట్టణంలో పురాతన కళాఖండాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఇందులోని అత్యంత విలువైన కళాకండాలను దోచుకున్నారు. మోసూల్ పురావస్తు శాలలో పెద్ద పెద్ద సుత్తులతో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇవి ఏడో శతాబ్దానికి చెందిన ఆస్పీరియన్లకు చెందినవి. సుత్తులతో డ్రిల్లింగ్ యంత్రాలతో ధ్వంసం చేసిన దృశ్యాలను ఇంటర్ నెట్ లో పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *