మోదీ పాలనకు ఏడాది..

mdoi

మోదీ ఏడాది పాలన ముగిసింది. మంగళవారం సరిగ్గా మోడీ పగ్గాలు చేపట్టి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా మోడీ మథుర బహిరంగ సభలో తన ఏడాది పాలన లో ఏమోం చేశారో చెప్పుకొచ్చారు. అధికార సమూహాలను విచ్చిన్నం చేశానని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార కేంద్రాలుగా విలసిల్లిన పవర్ సర్కిల్స్ ను తుద ముట్టించాలనని.. ప్రజల ఆశీర్వాదాలతో వందల సమూహాలను నాశనం చేశానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పాలనలో దేశం అథోగతి పాలయ్యిందని.. వారి పాలనే ఉంటే ఇంకా లోతున పడిపోయి ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పాలనలో పెట్రోల్ రేట్లను తగ్గించానని, బంగారాన్ని కిందకు దించానని.. ద్రవ్యోల్బణాన్ని మైనస్ స్థాయికి తీసుకువచ్చానని స్పష్టం చేశారు. వృద్ది రేటు కాంగ్రెస్ హయాంలో 5.6 గా ఉంటే ఈ ఏడాదిలోనే 7.5గా పరుగులు పెట్టించానని స్పష్టం చేశారు.

మోదీ విదేశీ పర్యటనలు విమర్శలు పాలైన అవి పెట్టుబడుల ప్రవాహానికేనని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ హయాంలోని ధరల మంట లేకున్నా ఇంకా కొంచెం మోదం.. కొంచెం ఖేదంగానే పాలన సాగింది. అనుకున్న అద్భుతాలు జరుగకున్నా.. ఫర్లేదు అన్న స్థాయిలో మోదీ పాలన సాగింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *