‘మోతె’ గ్రామానికి వస్తా .. : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి తీర్మానం చేసిన మోతె గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావును గ్రామస్తులు ఆహ్వానించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మోతె గ్రామానికి చెందిన ఎంపిపి బాలరాజు, గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచ్‌ రాజేశ్వర్‌, గ్రామానికి చెందిన పెద్దలు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మోతె గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
2001 లో కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో మోతె గ్రామస్తులు తెలంగాణ కావాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనికి స్పందించిన కేసిఆర్‌ మోతె గ్రామానికి వెళ్లి ఆ ఊరి మట్టితో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మళ్లీ గ్రామానికి వచ్చి ముడుపు విప్పుతానని ప్రకటించారు. అనుకున్నది అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసిఆర్‌ మోతెకు వెళ్లి ముడుపు విప్పారు. ఆ సందర్బంగానే టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ మోతె గ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే మోతె గ్రామస్తులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. గ్రామాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే గ్రామానికి వస్తానని మాటిచ్చారు. గ్రామస్తుల సమక్షంలోనే అన్ని విషయాలు చర్చించుకుందామని చెప్పారు. గ్రామాభివృద్దికోసం ఏలాంటి చర్యలు తీసుకోవాలి? రైతుల కోసం ఏం చేయాలి అనే విషయాలను అక్కడే మాట్లాడదామని సిఎం అన్నారు. మోతె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని కూడా ముఖ్యమంత్రి మాటిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *