Breaking News

మోడీ భార్య వార్త ప్రసారం చేసినందుకు అండమాన్ బదిలీ

dd-gujarat-official-sent-to-andamans-for-airing-jashodaben-news

ఢిల్లీ, ప్రతినిధి : ‘ప్రధాని మోడీ భార్య మీదనే వార్త ప్రసారం చేస్తావా ..? అండమాన్ బదిలీ చేశాం వెళ్లు’ అంటూ దూరదర్శన్ లోని ఉన్నతాధికారిని బదిలీ చేసింది కేంద్రం.

అసలు విషయం ఏంటంటే.. ప్రధాని భార్యగా తనకున్న హక్కులు తెలియజేయాలంటూ జశోదాబెన్ గుజరాత్ పోలీసులను సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 1న గుజరాత్ దూరదర్శన్ చానల్ ‘డిడి గార్నర్’లో కథనం ప్రసారం అయ్యింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆరోజు విధుల్లో ఉన్న కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వనోల్(58)ను ఈనెల రెండోవారంలో పోర్టు బ్లెయిర్ కు ట్రాన్స్ ఫర్ చేసింది.

పాపం ఒక వార్త ఆక్యన జీవితాన్నే మార్చేసింది. మరో ఏడాదిలో రిటైర్డ్ కావాల్సిన ఆయనను ఎక్కడో సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ కు బదిలీ చేయడంపై దూరదర్శన్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని భార్య అయితే వార్తను వార్తలా చూడాలని.. అయినా అన్ని చానాళ్లలో ఆ వార్త వచ్చిందని వారందరినీ అండమాన్ కు తరలిస్తారా.? అని ప్రశ్నిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ప్రభుత్వ దమననీతిని ప్రశ్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *