
బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని అణచివేయగల శక్తులు దేశంలో బలంగా ఉన్నాయని.. ఎమర్జెన్సీ వచ్చినా రావొచ్చని అద్వానీ వ్యాఖ్యానించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసినవే అని కాంగ్రెస్, ఇతర విపక్షాలు మండిపడ్డాయి.
మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదని మరో వైపు ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యాఖ్యానించాయి.