మోడీ-జైట్లీ విజన్ బడ్జెట్

modi and jaitley

వాస్తవాలను గుర్తిస్తే సరైన ప్లాన్ సాధ్యమవుతుంది. పదేళ్లలో చాలా వెనక్కి వెళ్లిన ఇంత పెద్ద దేశాన్ని గాడిలో పెట్టాలంటే ఒక్క రోజులో సాధ్యం కాదు. ఎంతో విజన్, ప్లాన్, చిత్తశుద్ధి అవసరం. అరుణ్ జైట్లీ బడ్జెట్ మోడీ వాస్తవిక దృష్టిని ప్రతిబింబించింది. ముఖ్యంగా ఐదు లక్ష్యాలు ఇందులో కనిపిస్తాయి.

మొదటిది, సంస్కరణల, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వంగా ముద్ర వేసుకోవడం. అంతర్జాతీయ క్రెడిట్ సంస్థలపై ప్రభావం చూపడం. క్రిసిల్ వంటి రేటింగ్ సంస్థలు పాజిటివ్ రేటింగ్ ఇవ్వడానికి ఈ బడ్జెట్ ఉపయోపడుతుంది. రెండోది, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. మన దగ్గర నిధులు లేనప్పుడు, అవి ఉన్న చోటు నుంచి మన వైపు ధన ప్రవాహం జరిగేలా ప్రయత్నించడం మేలు. కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి చర్యల ద్వారా విదేశీ బడా కంపెనీలకు భారత్ బంగారు బాతుగుడ్డుగా కనిపించే అవకాశం ఉంది.

మూడోది, విదేశీ పెట్టుబడుల ద్వారా పరిశ్రమల స్థాపన. మేకిన్ ఇండియా పేరుతో తయారీ రంగాన్ని పరుగు పెట్టించడం. దీనివల్ల మన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది. అనేక రకాల వస్తువులు దిగుమతి అవసరం లేకుండా పోతుంది. బోలెడు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పైగా ఎగుమతులకు అవకాశం పెరుగుతుంది.

నాలుగోది, పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగాలు పెరుగుతాయి. లక్షల మంది యువతీ యువకులకు ఉఫాధి లభిస్తుంది. పరిశ్రమలకు కావాల్సిన అనుబంధ వస్తువులు, సేవల కోసం ఇతరులపై ఆధార పడాలి. అలా ఎంతో మందికి స్వయం ఉపాధి లభిస్తుంది. జనాభాలో మూడింట రెండొంతుల మంది యువతరం ఉన్న దేశంలో భారీగా ఉద్యోగాలు కావాలి. దానికి మేకిన్ ఇండియా మంచి సాధనం.

ఐదోది, గ్రామీణ, వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం. రూరల్ ఇన్ ఫ్రా, రైతులకు రుణ సదుపాయం సరళతరం చేయడం వంటి చర్యల ద్వారా, తాము మూలాలను మరువ లేదని మోడీ, జైట్లీ చాటి చెప్పారు. మాటల గారడీకి బదులు, వాస్తవిక దృష్టితో తెచ్చిన బడ్జెట్ ఇది. గుజరాత్ వంటి చిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మోడీకి రెండేళ్లు పట్టింది. ఇంత పెద్ద దేశాన్ని గాడిలో పెట్టడం మాటలు కాదు. కానీ, అందుకు బలమైన ప్రయత్నం మాత్రం మొదలైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *