
దేశంలో అప్రతిహతంగా విజయాన్ని అందుకున్న బీజేపీని ఎదుర్కోవడానికి మహాకుటమి ఏర్పడింది.. బీహార్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా మహాకూటమి ఏర్పడింది. ఇందులో బీజేపీలో అధికార పార్టీ నితీష్ కుమార్ జేడీయూ, లలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, ములాయం నేతృత్వంలోని సమాజ్ వాదీ , కాంగ్రెస్లు కూటమిగా ఏర్పడ్డాయి. కానీ చివరకు సీట్ల సర్దుబాటులో ములాయం సమాజ్ వాడీ మహాకూటమినుంచి వైదొలిగింది.. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో మహాకూటమి చిన్నాభిన్నమైంది. మరో చిన్న పార్టీ కూడా వైదొలిగింది. దీంతో బీజేపీకి మంచి శకునాలే ఎదురవుతున్నాయి..
ఈ ఎన్నికల్లో బీజేపీ, బీహార్ లో గట్టిపోటీనిస్తోంది.. అక్కడ బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైనా గెలుపు సిద్దింస్తుందో లేదో పరిస్థితి .. దీంతో బీహార్ ఎన్నిక రసవత్తరమైంది..