మోడీ+చంద్రబాబు = విదేశీ పర్యటనలు

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడున్నారు కెనడాలో… ఏపీ సీఎం చంద్రబాబు చైనాలో.. వీరిద్దరి ఉద్దేశం ఒక్కటే.. అదే దేశానికి , రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహానికే.. కానీ వీరిద్దరు కూడా సగటున రెండు నెలలకు రెండు దేశాల చొప్పున పర్యటనలు కొనసాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.. ప్రధాని అంటే దేశ ప్రయోజనాలు.. వ్యక్తిగత ఇష్టాలు.. ఇలా ఏదో అనుకుందాం.. కానీ చంద్రబాబు కూడా ప్రధానిలా ఫీల్ అయి పోతున్నారట.. ప్రధాని ఏదైనా దేశానికి పర్యటనను ఖరారు చేసుకోవడం ఆలస్యం.. తాను విమానమెక్కి విదేశాలకు చెక్కేస్తున్నారు. దీనికి పెట్టుబడుల ముసుగు తొడుగుతున్నారు.

కాగా ప్రధాని నరేంద్ర మోడీ , ఏపీసీఎం చంద్రబాబు కంటే రాజకీయాల్లో జూనియర్.. చంద్రబాబు ఏపీ సీఎంగా 1996లో ఉన్నప్పుడు మోడీ ఇంకా సీఎంమే కాలేదు.. ఆయన టైం బాగుండి వరుసగా గుజరాత్ సీఎంగా గెలిచాడు. అదీ 2002 నుంచే.. అదే చంద్రబాబు అప్పటికే 9 ఏళ్లు సీఎం గా చేసి ఓడిపోయారు. ఓడిపోకుంటే ఇప్పుడు మోడీ ప్లేస్ లో ఉండేవాడే.. కానీ ఆయన దురదృష్టం ఏపీ సీఎంగానే పరిమితమయ్యాడు..

కానీ మోడీ పర్యటనలకు ధీటుగా చంద్రబాబు పర్యటిస్తూ తాను ప్రధానిలా ఫీలవుతున్నాడట.. ఆయన దేశానికి .. ఈయన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేందుకు కష్టపడుతున్నాడని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రధాని కాలేకపోయిన విదేశీ పర్యటనల్లో ప్రధానిని మించిపోతున్నారు చంద్రబాబు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *