Breaking News

మోడీకి స్పష్టమైన ప్రణాళికలున్నాయి..

Modi_Obama_Indo-US_Relations_PTI_650

-విజయసాధనలో భారతీయులకు కృతనిశ్చయం ఉంది.
ఢిల్లీ, ప్రభుత్వం : టీ అమ్ముకునే స్థాయి నుంచి భారత ప్రధానిగా మోడీ ఎదిగిన తీరు.. భారతీయుల కృతనిశ్చయానికి నిదర్శనమి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇండియా బయలు దేరేముందు ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు..

ప్రపంచ రాజకీయాల్లో భారత్ కున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెప్పారాయన.. భారత్ తమ సహజ భాగస్వామ్యపక్షమని అభివర్ణించారు. అమెరికా-భారత్ చరిత్రలో  కొత్త అధ్యాయం సృష్టించడం కోసం తమ పర్యటనను ఉపయోగించుకుంటానని తెలిపారు. మోడీతో కలిసి పనిచేసే అవకాశంగా ఈ పర్యటనను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..

మరోవైపు పాకిస్తాన్ కు ఆయన గట్టి హెచ్చరికలు పంపారు. ముంబై దాడుల తీవ్రవాదులు పాక్తిస్తాన్ లోనే ఉన్నారని.. వారందరికీ శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తన భూభాగం నుంచి తరిమివేయాల్సిందేనని పాకిస్తాన్ ను హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *