
మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ పై జరిమానా విధించిన తెలంగాణ పోలీసులు ఈరోజు హీరో రవితేజను కూడా వదిలిపెట్టలేదు. నల్ల ఫ్రేములతో కార్లో వెళుతున్న రవితేజ కారును ఆపి ఆ ఫ్రేములు తొలగించడంతో పాటు రూ.800 రూపాయల జరిమానా విధించారు. మరోసారి కారుకు నల్ల ఫ్రేములు అతికించవద్దని సూచించారు..
అనంతరం పోలీసులకు చలానా చెల్లించిన రవితేజ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సెలబ్రెటీలకు నల్లఫ్రేము లేకపోతే బయట తిరేగేటప్పుడు అభిమానులు గుర్తుపట్టి నానాయాగా చేస్తారు. కానీ పెట్టుకుంటే ఇలా పోలీసులు జరిమానా వేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ లాగే ఫ్రేములు పెట్టుకొని రవితే జ కూడా బుక్కయ్యాడు..