
పూలతో తెలంగాణ మహిళలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి తెలంగాణ, ఆంధ్రా, వివిధ దేశ విదేశాల్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ లోగిళ్లలో రంగుల కళ తెచ్చే బతుకమ్మ ఉత్సవాలు నేడు, రేపు కొనసాగనున్నాయి..
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై మహాబతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్, గవర్నర్, రాష్ట్ర మంత్రులు, తెలంగాణ జాగృతి అద్యక్షురాలు , ఎంపీ కవిత తదితరులు హాజరై ఘనంగా నిర్వహించారు.