Breaking News

మొదలైన పుష్కర సంరంభం

godavari_pushkaralu

కొండలు దాటి కోనలు దాటి వెల్లువలా గోదావరి కందకుర్తి వద్ద తెలుగుతల్లిని పలకరించింది. అనక బాసర సరస్వతీ అమ్మవారి చెంత అక్షరాలు నేర్చింది.. అడవుల తల్లి ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేసింది. ఉప్పొంగి ప్రవహించి ధర్మపురి నరసింహుడి పాదాలు కడిగింది.. పొరుగునే ఉన్న మంథని దాహార్తి తీర్చింది.. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి చెంద ముక్తి పొంది ఉద్యమ ఖిల్లా ఓరుగల్లును పావనం చేసింది.. తెలంగాణ గుమ్మం ఖమ్మం చేరి భద్రాద్రి రామయ్య ఒడిలో సేదతీరింది.. పాపికొండలను చీల్చుకుంటూ వడివడిగా సాగరం వైపు సాగిపోయింది..

పుష్కర సంరంభం ప్రారంభమైంది. గోదావరికి 144 సంవత్సరాల తర్వాత వస్తున్న పుష్కరాలు కావడంతో వీటిని మహాపుష్కరాలుగా అభివర్ణిస్తున్నారు. దీంతో భక్తుల తాకిడి ఎక్కువైంది.. 12 సంవత్సరముల కోసారి వచ్చే ఈ పుష్కర మహోత్సవానికి పుష్కరఘాట్లు సిద్ధమయ్యాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 106 ఘాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలున్నాయి. అవి.. ఆదిలాబాద్ జిల్లా బాసర, కరీంనగర్ జిల్లా ధర్మపురి, కాళేశ్వరం, ఖమ్మం జిల్లా భద్రాచలంకు పుష్కరాలకు భారీ జనం తరలిరానున్నారు.

తెలంగాణలోని ద్వితీయ ప్రాధాన్యక్షేత్రాలైన నిజామాబాద్ జిల్లా కందకుర్తి, పోచంపాడు, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ బాదనకుర్తి, సోన్, గూడెం, లోకేశ్వరం బ్రహ్మేశ్వరం, మంచిర్యాల, చెన్నూర్, కరీంనగర్ జిల్లా కోటిలింగాల, మల్లాపూర్ మండలం ఎర్దండి.. వాల్గొండ, మంథని, వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని మల్లుకుంట, రామన్నగూడెం, ఖమ్మం జిల్లాలోని 8 క్షేత్రాల్లో కూడా పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్షేత్రాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది.. భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ ముక్తి పొందుతున్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *