మొదలైన ఎమ్మెల్సీ ఓటింగ్, రేవంత్ కు జడ్జి అనుమతి

తెలంగాణ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఉదయం 9 గంటలకు మొదలైంది. ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముందుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంథని ఎమ్మెల్సీ పుట్ట మధు, నల్గొండ ఎమ్మెల్యే ఒకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ, హోంమంత్రి నాయిని తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంచం ఇస్తూ అడ్డం దొరికి అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డికి ఏసీబీ  జడ్జి లక్ష్మీపతి మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆయనను పోలీసులు అసెంబ్లీకి తీసుకువచ్చారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎర్రబెల్లి , వేం నరేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం రేవంత్ ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *