
ప్రపంచకప్ క్రికెట్ ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నాకౌట్ పోరు.. గెలిస్తే సెమీస్ చేరుతారు. దీంతో ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇండియా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ ల్లో గెలిచి నాకౌట్ పోరుకు వచ్చింది. బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ పై సంచలన విజయంతో ఆ జట్టును ఇంటికి పంపించి నాకౌట్ కు అర్హత పొందింది.
ఇక ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ నాకౌట్ మ్యాచ్ ల్లో ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.