
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లో మన తెలుగు టీం.. ఈ టీంపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు.. వరుసగా ఆడిన తొలిరెండు మ్యాచ్ లు ఓడిపోయింది. పెద్ద స్టార్ లు సైతం లేరు.. ఒక్క డేవిడ్ వార్నర్ కెప్టెన్ తప్ప ఎవరూ ఆడడం లేదు. దీంతో ఈ జట్టుపై ఎవరికి అంచనాలు లేవు.. గెలుస్తుందన్న నమ్మకం లేదు.
కానీ ఒకే ఒక్కడు సన్ రైజర్స్ లో స్ఫూర్తి నింపాడు.. ఒక్కడే ఆడి అత్యధిక పరుగులు చేసి సన్ రైజర్స్ ను ఏకంగా ఇప్పుడు పాంయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. అతడే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. వార్నర్ స్ఫూర్తితో తడబాటుకు గురై ఆడని ధావన్ కూడా రాణించడంతో ఇక సన్ రైజర్స్ విజయాల బాటపట్టింది. యువరాజ్, నెహ్రా వంటి సీనియర్లు కూడా గాయాలనుంచి కోలుకొని ఆడుతుండడంతో ఇక సన్ రైజర్స్ గెలుపు బాటలో ప్రస్తుతం ఐపీఎల్ లో టాప్ లో నిలించింది. మొదట్లో అసలు పోటీలోనే లేనన్నవారు కూడా ఇప్పుడు సన్ రైజర్స్ ఆట చూసి షాక్ అవుతున్నారు.
కాగా స్టార్ ఆటగాళ్లతో నిండిన రాయల్ చాలంజర్స్ బెంగళూరు మాత్రం వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసులో వెనుకబడింది. ఆలస్యంగా పుంజుకున్న ఆజట్టు గడిచిన 4 మ్యాచ్ ల్లో గెలిచి మల్లీ ఆశలు రేపుతోంది.. చూడాలి ఏం జరుగుతుందో..