
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తెలుగు సినీ పరిశ్రమ పాల్గొని మొక్కలు నాటింది.. హీరోలు చిరంజీవి, నాగార్జున, అక్కినేని అమల, రానా, అల్లు అర్జున్ , హీరోయిన్లు రకుల్ ప్రీత్, రాశికన్నా తదితరులు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.
హీరో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో పోలీసులతో కలిసి మొక్కలు నాటారు. ఇక చిరంజీవి జూబ్లిహిల్స్ లో పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అమల కూకట్ పల్లిలో మొక్కలు నాటింది. హీరోలు రానా, అల్లు అర్జున్ ఫ్యామిలీలు వారి ఇళ్లల్లో మొక్కలు నాటి హరితహారం మంచి కార్యక్రమమని.. అందరూ మొక్కలు నాటాలని సూచించారు.