Breaking News

మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి: నీతూ ప్రసాద్

మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి: నీతూ ప్రసాద్

కరీంనగర్: తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంపకంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేయాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు వారి పరిధిలలోని క్షేత్ర సిబ్బంది సహకారంతో ఆయా భవనాలు, ఖాళీ స్ధలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. ప్రతి మొక్కకు రూ.7.50 చొప్పున చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మొక్కల పెంపకంలో క్షేత్ర స్ధాయి సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అటవి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొక్కల పెంపకంలో మహిళా సంఘాలను, యువతను, విద్యార్ధులను భాగస్వాములను చేసి జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని ఆమె అన్నారు. రోడ్లు, భవనాలు శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్డు, భవనాల పరిధిలో మొక్కలను నాటాలని అన్నారు. అదే విధంగా పంచాయితీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన రోడ్డు పనులు ఇరువైపుల పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని అన్నారు. విద్యాలయాలు, వసతి గృహలు వంటి ప్రాంతాలలో విద్యార్ధులతో పెద్ద ఎత్తున మొక్కలను నాటించాలని అన్నారు. దేవాదయ శాఖ ద్వారా దేవాలయాలు, పరిసర ప్రాంతాలు, గుట్ట ప్రాంతాలలో పూల మొక్కలను పెంచాలని అన్నారు. వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, పట్టు పరిశ్రమ, గిరిజన సంక్షేమం, ఎన్.టి.పి.సి. ఉద్యానవనం శాఖల ద్వారా మొక్కల పెంపకం వివరాలను ఆయా శాఖల అధికారులతో తెలుసుకొని మరింత ఎక్కువ మొత్తంలో పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కరీంనగర్ జిల్లాను తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో మొక్కలను పెంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశాలకు అధికారులు విధిగా హజరై సమయపాలన పాటించాలని ఆమె అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, డ్వామా పిడి గణేష్, డి.ఆర్.డి.ఎ. పి.డి. అరుణశ్రీ, సామాజిక అటవీ సంరక్షణ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ సంయక్త సంచాలకురాలు సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు
యాదయ్య, పంచాయితీ రాజ్, రోడ్డు, భవనాల శాఖ, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *