
మారుతి సుజుకి స్విఫ్ట్ మైలేజ్ లో సత్తా చాటింది. మైలేజ్ చెకింగ్ ర్యాలీ ఏకంగా డీజిల్ వెర్షన్ మారుతి స్విఫ్ట్ లీటరుకు 40.58 కి.మీ మైలీజి ఇచ్చి అబ్బురపరిచింది. మారుతి సుజుకి హైదరాబాద్ లో తన ష్విఫ్ట్ యజమానుల కోసం స్విఫ్ట్ మైలేజీ ర్యాలీ నిర్వహించింది. సుమారు 100 మంది పాల్గొన్న ఈ ర్యాలీలో పెట్రోల్ వెర్షన్ స్విఫ్ట్ 38.69 కి.మీ మైలేజీని సాధించింది.
ఈ ర్యాలీలో పెట్రోల్ వెర్షన్ లో శ్రీలత ప్రథమ స్థానంలో నిలిచింది. డీజిల్ వెర్షన్ లో ప్రభు, ఇమ్రాన్ రెండో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 12.7 లక్షల మంద స్విఫ్ట్ కస్లమర్లున్నారని.. వీరి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు సుజుకి మారుతి నిర్వాహకులు తెలిపారు. కాగా కొత్త స్విఫ్ట్ డీజిల్ వేరియంట్ లీటర్ కు 25.2 కి.మీ, పెట్రోల్ వెర్షన్ లీటర్ కు 20.4 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.