మైనార్టీల సంక్షేమంపై దృష్టి

మైనార్టీల సంక్షేమంపై దృష్టి

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): మైనార్టీల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు గాను రాష్ర్ట వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి 60 గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కెసిఆర్ తెలిపారు. అంతే కాకుండా మైనార్టీలలో ఎక్కువగా ముస్తీంలు చదువులో వెనుకబడి పోతున్నారని, ఇందుకోసం గురుకుల పాఠశాలల్లో తెలుగుతో పాటు ఉర్దూను కూడా ఆప్షనల్ లాంగ్వేజ్ గా బోధించాలని అన్నారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు కెసిఆర్ విద్యా నేతలతో పాటు అధికారులతో, నేతలతో సమావేశం నిర్వహించారు. అందరూ ఆమోదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని డ్రాపౌట్స్ లేకుండా యువతకు ఉపాధి కల్పనతో పాటు మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చంచల్ గూడ రేసుకోర్సును తొలగించి అక్కడ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించనున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *