
ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వారా వివిధ పథకాలను అల్ప సంఖ్యాక వర్గాలకు అందేలా కృషి చేస్తానని శ్రీ యం. దానకిశోర్ అన్నారు. గురువారం సచివాలయంలో మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీ సయ్యద్ ఒమర్ జలీల్ నుండి ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించినందుకు ప్రభుత్వానికి అయన కృతజ్ఞతలు తెలిపారు. బదిలీ పై వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా వెళ్తున్న శ్రీ సయ్యద్ ఒమర్ జలీల్ కు
ఈసందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తూ, ఇది ఒక చాలెంజింగ్ జాబ్ అని, శ్రీ దానకిశోర్ గారు ఇదివరకు మైనారిటీస్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్నందున సమర్థవంతంగా నిర్వహించగలడని శ్రీ సయ్యద్ ఒమర్ జలీల్ అన్నారు. ఈ సందర్భంగా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారులను నూతన కార్యదర్శి కి పరిచయం చేశారు. గత 3 సంవత్సరాలలో మైనారిటీస్ అభివృద్దికై చేపట్టిన పథకాల వివరాల బుక్ లెట్ ను ఈ సందర్భంగా అందచేశారు.