
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కా, తదితర పేరుమోసిన సీఈవోలతో ఆదివారం మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో తెలుగువాడు సత్యనాదెళ్ల మాట్లాడారు. భారత్ లోని శ్రీకాకుళం జిల్లాలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించడం భారత్ డిజిటల్ రంగం వైపు అడుగులకు నిదర్శనమన్నారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్ బాండ్ సౌకర్యం కల్పించడం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డ్రాపవుట్స్ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారన్నారు.
కాగా సత్య నాదెళ్ల ప్రసంగంలో తెలుగుదనం ముఖ్యంగా ఏపీ పై , భారత్ పై ప్రేమ కనపడింది. ఆయన తన ప్రసంగంలో శ్రీకాకుళం జిల్లాను, ఆంధ్రప్రదేశ్ ను పొగిడారు.ఎంతైనా తెలుగువాడి దేశభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.