
పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో కొత్త రకం తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్.. అచ్చం యాపిల్ ఫోన్ల వలే తీసుకొచ్చిన ఈ గాడ్జెట్ లు ఇప్పుడు మార్కెట్లో హాట్ హాట్ గా అమ్ముడవుతున్నాయి.. స్మార్ట్ ఫోన్లు లూమియా 950, లూమియా 950 ఎక్స్ఎల్తో పాటు ఆధునిక టాబ్లెట్ పీసీ, స్మార్ట్ బ్యాండ్, ల్యాప్ టాప్ లను సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది..
కాగా ఈ అత్యాధునిక ఫోన్లు ట్యాబెట్ల ధర మాత్రం భారీగానే పెంచింది మైక్రోసాఫ్ట్. లూమియా 950 ధర 35700, ఎక్స్ ఎల్ 42200లుగా నిర్ణయించి ధరలను ఆకాశాన్నంటించింది..