Breaking News

మే 7న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘బహ్మోత్సవం’ ఆడియో 

మే 7న సూపర్‌స్టార్‌ మహేష్‌ 'బహ్మోత్సవం' ఆడియో
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియోను మే 7న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ – ”మా ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. మే 7న హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ చాలా అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు. ఒక అద్భుతమైన కథతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌కి, మా బేనర్‌కి ఇది ఒక ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు” అన్నారు.  సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *