మే 28న జ‌ర్న‌లిస్టుల గ‌ర్జ‌న ను జ‌య‌ప్ర‌దం చేయండి

 

*టీయుడబ్ల్యుజె పిలుపు*
జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆయా హామీలు అమలు చెయ్యాలనే డిమాండుతో ఈనెల 28న హైద‌రాబాద్ లోని ఆర్టిసి క‌ళ్యాణ మండ‌పంలో నిర్వ‌హించ‌నున్న  జర్నలిస్టుల గర్జన సభను విజ‌య‌వంతం  చేయాలని తెలంగాణ  రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్( టీయుడబ్ల్యుజె ) పిలుపునిచ్చింది. మంగళవారం
బ‌షీర్ బాగ్ లోని టియూడ‌బ్ల్యూజే కార్యాల‌యంలో జర్నలిస్టుల గర్జన పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజె సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టి  2014 ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న, జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.  జ‌ర్న‌లిస్టుల‌కు ఇండ్లు, ఇండ్ల స్థ‌లాలు, వైద్యం, అక్రెడిటేషన్ వంటి అంశాల‌పై ప్ర‌భుత్వ హ‌మీలు హామీలుగానే మిగిలాయ‌ని ఆయన విమ‌ర్శించారు. జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల సాధ‌న‌కై చేప‌ట్టిన  చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఐజేయు సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ,  ఎన్నిక‌ల ముందు  జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన హామీలను నాలుగు సంవత్సరాలు గడిచినా అమలుచేయకపోవడం సహించరాని చర్యగా  అభివర్ణించారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని  మండిప‌డ్డారు.  జర్నలిస్టుల మనోవేదనను గుర్తించి వారి సమస్యలను వెంట‌నే  పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు , జర్నలిస్టుల గొంతులు ఐక్య‌మై  గర్జించాలని ఆయన పిలుపునిచ్చారు. టీయుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ మే 28న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రభుత్వానికి ఒక హెచ్చరికలా పనిచేయాలన్నారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మ‌రియు  ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు కలిసి వచ్చే ప్రజా సంఘాల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె కోశాధికారి కె.మహిపాల్ రెడ్డి,  హెచ్ యు జె కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *